: ఆల్ఫ్స్ పర్వతాల్లో మానవ శరీర భాగాలు లభ్యం.... 1966 ఎయిరిండియా మృతులవేనా?
ఫ్రెంచ్ ఆల్ఫ్స్ పర్వతాల్లోని మౌంట్ బ్లాంక్ ప్రాంతం వద్ద మానవ శరీర భాగాలు లభ్యమయ్యాయి. ఇవి 1950, 1966ల్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదాల్లో మృతి చెందినవారివేనని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. విమాన ప్రమాదాల గురించి అధ్యయనం చేసే డేనియల్ రోషే ఆల్ఫ్స్‌లోని బోసన్ హిమనీనదంలో విమాన శకలాల కోసం కొన్ని సంవత్సరాల నుంచి వెతుకున్నాడు. ఇప్పుడు శరీర భాగాలు దొరకడంతో ఇన్నాళ్లకు తన శ్రమకు తగిన ఫలితం లభించిందని అన్నాడు.
ఈ ప్రాంతం వద్ద 1950లో జరిగిన ఎయిరిండియా ప్రమాదంలో 78 మంది, 1966లో జరిగిన ఎయిరిండియా బోయింగ్ 707 ప్రమాదంలో 117 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతంలో అప్పటి విమాన ఇంజిన్ శిథిలాలను కూడా కనిపెట్టినట్లు రోషే తెలిపాడు. ఒక చేయి భాగం, ఒక కాలి భాగం దొరకడంతో ఇవి ఒక్కరి అవయవాలేనా? లేక ఇద్దరివా? అని తెలుసుకోవడానికి వాటిని డీఎన్ఏ పరీక్షలకు పంపినట్లు రోషే చెప్పాడు. ఆల్ఫ్స్ ప్రాంతంలో సంవత్సరాంతం శీతల ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల అక్కడ మృత దేహాలు త్వరగా పాడవవు.