: గ్రామ సదస్సులో వీఆర్వోపై చేయిచేసుకున్న జాయింట్ కలెక్టర్.. నివ్వెరపోయిన గ్రామస్తులు!
గ్రామ సభలో అందరూ చూస్తుండగా వీఆర్వోపై జేసీ చేయిచేసుకోవడం కలకలం రేపుతోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్ మండలంలోని ధర్మాపూర్ లో గ్రామ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది సభలో పాల్గొన్నారు. గ్రామానికి సంబంధించిన భూముల వివరాలు చెప్పాలని వీఆర్వో మహమూద్ పాషాను జాయింట్ కలెక్టర్ శివకుమార్ అడిగారు. అయితే సరైన వివరాలు అందించలేదని చెబూతూ పాషాపై జేసీ చేయిచేసుకున్నారు. దీంతో సభలోని వారంతా అవాక్కయ్యారు. బహిరంగ సభలో జేసీ అలా ఒక వ్యక్తిపై చేయి చేసుకోవడం సరికాదని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.