: ఇక నుంచి ఏసీ కోచ్‌లలో దుప్పట్లు వుండవు... భారతీయ రైల్వే నిర్ణయం
ఇటీవల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తన నివేదికలో కొన్ని రైల్వే జోన్లలో మూడేళ్ల నుంచి ఏసీ కోచ్‌లో ఉపయోగించిన బ్లాంకెట్లను ఉతకడం లేదని వివరిస్తూ భారతీయ రైల్వే పనితీరును తప్పుబట్టింది. అంతేకాకుండా ప్రతి మూడు రోజులకు ఒకసారి బ్లాంకెట్లను ఉతకాలని సలహా కూడా ఇచ్చింది. ఇలా చేయడం కుదరకపోవడంతో ఏసీ కోచ్‌లలో మొత్తానికే బ్లాంకెట్ అందుబాటులో ఉంచకూడదని భారతీయ రైల్వే నిర్ణయించుకుంది.
దీనికి బదులుగా ఒక చిన్న పలుచని దుప్పటి సమకూర్చి, ఏసీ ఉష్ణోగ్రతను ప్రస్తుతమున్న 19 డిగ్రీల నుంచి 24 డిగ్రీలకు పెంచనున్నారు. నిజానికి ఒక్కో బ్లాంకెట్ శుభ్రపరచడానికి రైల్వేకి రూ. 55 ఖర్చవుతుంది. అయినప్పటికీ ప్రయాణికుల నుంచి కేవలం రూ. 22 మాత్రమే వసూలు చేస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఇప్పటికే గరీబ్ రథ్ రైళ్లలో బ్లాంకెట్లకు బదులుగా పలుచని దుప్పట్లు సరఫరా చేస్తున్నారు.