: టెస్టుల్లో 17వ సెంచరీ చేసిన కోహ్లీ... శ్రీలంక టార్గెట్ 550 పరుగులు
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు. ఈ క్రమంలో టెస్టుల్లో తన 17వ సెంచరీని నమోదు చేశాడు. 133 బంతుల్లో (5 ఫోర్లు, 1 సిక్సర్) కోహ్లీ సెంచరీని సాధించాడు. కోహ్లీ 103, రహానే 23 పరుగుల వద్ద ఉన్నప్పుడు టీమిండియా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లో 240 పరుగులు చేసిన భారత్... మొత్తం మీద శ్రీలంక ముందు 550 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది. శ్రీలంక బౌలర్లలో పెరీరా, లహిరు కుమారా, గుణతిలకలు చెరో వికెట్ తీశారు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ ఇప్పుడే ప్రారంభమైంది. కరుణరత్నే, తరంగలు ఇన్నింగ్స్ ను ప్రారంభించారు.