: ప్రొకబడ్డీ లీగ్: సచిన్ జట్టుకు షాకిచ్చిన తెలుగు టైటాన్స్.. తమిళ్ తలైవాస్ చిత్తు!


ప్రొకబ్డీ లీగ్ ఐదో సీజన్ ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌ను తిలకించేందుకు సినీ, క్రీడా ప్రముఖులు పలువురు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తొలి మ్యాచ్‌లో తెలుగు జట్టు శుభారంభం చేసి సచిన్ జట్టుకు షాకిచ్చింది. హైదరాబాదు, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన జోన్-బి తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్-తమిళ్ తలైవాస్ జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 32-27తో తమిళ్ తలైవాస్‌ను చిత్తు చేసింది. తెలుగు జట్టు కెప్టెన్ రాహుల్ చౌదరి పది రైడ్ పాయింట్లతో అదరగొట్టగా మరో ఆటగాడు విశాల్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచడంలో విజయం సాధించిన తెలుగు టైటాన్స్ జట్టు చివరికంటా పట్టు సడలకుండా జాగ్రత్త పడింది. ఫలితంగా తమిళ్ తలైవాస్‌పై ఘన విజయం సాధించి లీగ్‌లో బోణీ కొట్టింది.

మెగా లీగ్‌ను తిలకించేందుకు క్రీడా, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమిళ్ తలైవాస్ యజమానులు సచిన్, చిరంజీవి, నిమ్మగడ్డ ప్రసాద్, చాముండేశ్వరినాథ్, సినీ నటులు రానా, అల్లు అర్జున్, అల్లు అరవింద్, పీవీ సింధు, గోపీచంద్ తదితరులు హాజరయ్యారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ జాతీయ గీతం ఆలపించాడు.
 
 
 

  • Loading...

More Telugu News