: విచారణ కొనసాగుతోంది... రవితేజతో పాటు మరో ఇద్దరిని కూడా విచారిస్తున్నాం: సిట్
టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజ విచారణ కొనసాగుతోందని సిట్ ప్రకటించింది. నేటి ఉదయం పది గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చిన రవితేజను అధికారులు సమగ్రంగా ప్రశ్నిస్తున్నారు. దీంతో విచారణ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. రవితేజతో పాటు తౌబీర్ అహ్మద్, సయ్యద్ యూనస్ లను కూడా విచారిస్తున్నట్టు సిట్ తెలిపింది. రేపు రవితేజ డ్రైవర్ శ్రీనివాసరాజును విచారించనున్నట్టు తెలిపింది. టాలీవుడ్ లో పబ్ కల్చర్, పబ్ లలో డ్రగ్స్ సరఫరా, కెల్విన్, జీశాన్ తో పరిచయం, విదేశాల టూర్లు, టూర్లలో కార్యక్రమాలు, ఇతర అంశాలపై రవితేజను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.