: డ్రగ్స్ కంటే అవినీతి మరింత ప్రమాదకరం.. ప్రభుత్వాలు దీనిపై సిట్ లు వేయాలి: దర్శకుడు కొరటాల శివ
డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ... సినీ ప్రముఖులు ఒక్కొక్కరు దీనిపై వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. వరుస హిట్లతో మాంచి జోష్ మీద ఉన్న దర్శకుడు కొరటాల శివ... తాజాగా ఈ అంశంపై స్పందించాడు. అవినీతి భూతాన్ని అంతం చేసేందుకు అన్ని ప్రభుత్వాలు సిట్ లను వేయాలని ఆయన ట్విట్టర్ ద్వారా సూచించారు. సమాజానికి అత్యంత ప్రమాదకరమైనది అవినీతి అని అన్నాడు. డ్రగ్స్ కన్నా దీని వల్లే సమాజానికి ఎక్కువ చెడు జరుగుతుందని చెప్పాడు. ప్రభుత్వాలు తలచుకుంటే ఈ పని చేయగలుగుతాయని అన్నాడు.