: తండ్రి ట్వీట్ కు స్పందించిన అక్షరహాసన్
తన కుమార్తె అక్షరహాసన్ మతం మార్చుకుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో, 'అమ్మా అక్షూ, మతం మార్చుకున్నావా' అంటూ కమలహాసన్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీనికి అక్షర సమాధానం ఇచ్చింది. 'హాయ్ నాన్న. మానవ జీవన మార్గం, గమ్యాన్ని బోధించే బౌద్ధ మతాన్ని నేను అంగీకరిస్తున్నా. అయినా ఇప్పటికీ నేను నాస్తికురాలినే' అంటూ తండ్రి ట్వీట్ కు ఆమె రీట్వీట్ చేసింది. మరోవైపు, ఏ మతాన్ని స్వీకరించినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటానని అక్షరకు కమల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.