: హాయ్ అక్షు, మతం మారావా?: కూతురుకి కమలహాసన్ ట్వీట్
తన చిన్ని కుమార్తె అక్షరహాసన్ బౌద్ధమతాన్ని స్వీకరించిన సంగతి కమలహాసన్ కు తెలిసినట్టు లేదు. ఇదే విషయన్ని ఆయన తన కుమర్తెను ట్విట్టర్ ద్వారా అడిగారు. 'హాయ్ అక్షు. నీవు మతాన్ని మార్చుకున్నావా? నీవు మతాన్ని మార్చుకున్నా... నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. మతం షరతులతో కూడి ఉంటుంది. ప్రేమకు షరతులు ఉండవు. జీవితాన్ని సంతోషంగా గడుపు. ప్రేమతో, మీ బాపు' అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కమల్ ను ఓ గొప్ప తండ్రిగా కొనియాడుతున్నారు.