: సీన్ ముందే రాసుకున్నాం... 'హోటల్' బదులు 'రిసార్ట్' చేర్చామంతే... 'నేనే రాజు నేనే మంత్రి' డైలాగుపై తేజ వివరణ
‘100 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి రిసార్ట్‌లో పెడితే సాయంత్రానికి నేను కూడా అవుతా... సీఎం’ అంటూ తన కొత్త చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి'లో రానా చెప్పిన డైలాగ్, తెలుగులోకన్నా, తమిళంలో ఎక్కువ కలకలాన్ని సృష్టించిన వేళ, సినిమా దర్శకుడు తేజ స్పందించాడు. ఇటీవల తమిళ రాజకీయాల్లో జరిగిన ఘటన ఆధారంగా సినిమాలో ఈ సీన్ ను అల్లుకుని ఉంటారని ఊహాగానాలు చెలరేగుతున్న వేళ, ఆ వార్తలను కొట్టి పారేశాడు.
తమిళంలో 'నాన్ ఆనైవిట్టాల్' పేరిట విడుదలవుతున్న చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న తేజ మాట్లాడుతూ, ఆ డైలాగున్న సీన్ ను ముందే తీసుకున్నామని, అయితే, 'రిసార్ట్' అన్న పదం స్థానంలో తొలుత 'హోటల్' అని పెట్టామని, తమిళనాడు ఘటనల నుంచి ప్రేరణతో 'రిసార్ట్' అంటే బాగుంటుందన్న అభిప్రాయంతో స్వల్పంగా మార్చామని అన్నాడు.