: హైకోర్టును ఆశ్రయించిన లాలూ ప్రసాద్ యాదవ్... లభించని ఊరట!


బీహార్ లో అత్యధిక స్థానాలున్న తమ పార్టీని కాకుండా, తక్కువ సీట్లున్న జనతాదళ్ (యు) ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం, నితీశ్ కుమార్ తో ప్రమాణ స్వీకారం చేయించడం చట్ట విరుద్ధమని ఆరోపిస్తూ, ఆర్జేడీ ఈ ఉదయం పాట్నా హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్ తదితరుల పేరిట పిటిషన్ దాఖలు కాగా, దీన్ని విచారణకు స్వీకరిస్తున్నామని చెప్పిన న్యాయమూర్తి, తక్షణ ఆదేశాలు ఇచ్చేందుకు మాత్రం నిరాకరించారు. పిటిషన్ ను సోమవారం విచారిస్తామని న్యాయస్థానం చెప్పడంతో కోర్టులో లాలూకు ఊరట లభించనట్లయింది. నేడు జరిగే బల నిరూపణను కూడా అడ్డుకునేలా స్టే ఇవ్వలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. బల నిరూపణ ఫలితాలను పరీక్షిస్తామని మాత్రం చెప్పారు.

  • Loading...

More Telugu News