: ఆగస్టు 15కి రూ. 200 నోట్లు!


భారత ప్రజలను చిల్లర కష్టాల నుంచి గట్టెక్కింస్తుందని భావిస్తున్న రూ. 200 నోటు ఎప్పుడు విడుదలవుతుందన్న విషయమై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టత ఇచ్చింది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకునే నాటికి ఈ కొత్త నోట్లు చెలామణిలోకి వస్తాయని, ఇవి తొలుత బ్యాంకుల ద్వారా మాత్రమే అందించాలని నిర్ణయించామని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి.

నోట్ల ముద్రణ పూర్తయిందని, మార్కెట్లోకి పంపే ప్రక్రియ సైతం తుది దశలో ఉందని ఓ అధికారి వెల్లడించారు. అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో ఇవి తయారయ్యాయని తెలిపారు. కాగా, ఇప్పటికే రూ. 2 వేల నోట్ల ముద్రణను నిలిపివేసిన ఆర్బీఐ, రూ. 200 నోట్లను భారీగా ముద్రిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నోట్ల ముద్రణా వేగం పుంజుకోవడంతో అనుకున్న సమయానికన్నా ముందుగానే వీటిని చెలామణిలోకి తేవాలన్నది ఆర్బీఐ అభిమతం.

  • Loading...

More Telugu News