: నిలకడగా విక్రమ్ ఆరోగ్య పరిస్థితి.. బులెట్లు బయటకు తీసిన వైద్యులు.. కాల్పులు జరిపింది అతడేనా?


కాంగ్రెస్ నేత, మాజీమంత్రి ముకేశ్ గౌడ్‌ కుమారుడిపై కాల్పుల వ్యవహారంలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. విక్రమ్ గౌడ్ గురువారం రాత్రి ఇంటికి వచ్చే ముందు ఎవరితోనో గొడవ పెట్టుకుని వచ్చినట్టు తెలుస్తోంది. కోపంతో రగిలిపోయిన ఆ వ్యక్తే నేరుగా ఇంటికి వచ్చి కాల్పులు జరిపినట్టు అనుమానిస్తున్నారు. కాల్పులు జరిపిన అనంతరం పరారైన అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కాగా, హైదరాబాదు, జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ గౌడ్ శరీరం నుంచి వైద్యులు తూటాలు బయటకు తీశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర రావు తెలిపారు. దాడి ఎలా జరిగిందన్న విషయాన్ని విక్రమ్ చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు. కుటుంబ కలహాలే కాల్పులకు కారణంగా భావిస్తున్నట్టు వివరించారు.  

  • Loading...

More Telugu News