: హోం మంత్రి అధ్యక్షతన రాష్ట్ర భద్రత కమిషన్
రాష్ట్రంలో తొలిసారిగా భద్రత కమిషన్ ఏర్పాటు చేశారు. దీనికి రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తారు. రాష్ట్ర డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఈ కమిషన్ లో సభ్యులుగా వ్యవహరిస్తారు.