: కోల్డ్ వార్ సమయంలో అమెరికాను భయపెట్టిన రష్యా సబ్ మెరీన్ ఇప్పుడు ఒడ్డుకు చేరింది!
అమెరికా, సోవియెట్ యూనియన్ మధ్య ఒకప్పటి కోల్డ్ వార్ సమయంలో అమెరికాను భయపెట్టిన, ప్రపంచంలోనే అతిపెద్ద సబ్ మెరైన్ 'ప్రిన్స్ ఆఫ్ మాస్కో' తీరానికి చేరింది. 574 అడుగుల పొడవున్న ఈ సబ్ మెరీన్ ఒకసారి సముద్రంలో అడుగు పెడితే 120 రోజుల పాటు నిర్విరామంగా సేవలందించగలదు. టైపూన్ శ్రేణికి చెందిన ఈ సబ్ మెరీన్ నుంచి ఒకేసారి 20 అణు టార్పెడోలను సంధించగలదు. దీని పేరు దిమిత్రీ డోన్ స్కోయ్... ఈ పేరుగల రాజు రష్యాను 1359 నుంచి 1389 వరకు పరిపాలించారు.
నేవీ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఆయుధ సంపత్తిని రష్యా ప్రదర్శించనుంది. ప్రపంచయుద్ధం రానుందన్న వూహాగానాలు, వివిధ దేశాల మధ్య మొదలైన వివాదాల నేపథ్యంలో వివిధ దేశాలు తమ ఆయుధ సంపత్తిని వివిధ ఉత్సవాల పేరిట ప్రదర్శిస్తున్నాయి. తద్వారా తాము చాలా శక్తిమంతులమని చాటుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా నేవీ డేను ఘనంగా నిర్వహించాలని సంకల్పించింది. ఇందులో పాల్గొనేందుకు ఈ భారీ సబ్ మెరీన్ ను నావల్ బేస్ కు రప్పించారు.