: ముగిసిన ముమైత్ విచారణ...తిరిగి బిగ్ బాస్ హౌస్ కి?


ముమైత్ ఖాన్ విచారణ ముగిసింది. సుమారు ఆరున్నర గంటలపాటు ముమైత్ ఖాన్ ను సిట్ విచారించింది. బిగ్ బాస్ షో ప్రతినిధులతో కలిసి పూణే నుంచి హైదరాబాదు చేరుకున్న ముమైత్...వారితో కలిసి ఉదయం పది గంటలకు సిట్ కార్యాలయానికి చేరుకుంది. ఉదయం నుంచి కెల్విన్ తో సంబంధాలు, డ్రగ్స్ వినియోగం, సరఫరా, పార్టీ లైఫ్ వంటి విషయాలపై వివిధ విషయాలను ఆమె నుంచి రాబట్టారు. అనంతరం విచారణ ముగిసినట్టు తెలిపారు. దీంతో ఆమె తిరిగి బిగ్ బాస్ సిబ్బందితో కలిసి వెనుదిరిగారు. మళ్లీ తిరిగి ఆమె బిగ్ బాస్ హౌస్ కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఎవరినీ కలవకుండా, కనీసం ఆమెకు ఫోన్ కూడా అందుబాటులో లేకుండా బిగ్ బాస్ షో నిర్వాహకులు జాగ్రత్తపడ్డారు. 

  • Loading...

More Telugu News