: ఈ పువ్వు ధర తెలిస్తే షాకే..ఫ్లవర్ షాప్ లో చోరీకి గురైన పుష్పం..సీసీ పుటేజ్ పరిశీలించి మరీ పట్టుకున్న పోలీసులు


ఫ్లవర్ షాప్ లో ఒక పువ్వు చోరీకి గురైందంటే మరోపువ్వు ఇవ్వొచ్చుకదా? దానికి హడావుడి ఎందుకు అనిపించిందా? ఈ పువ్వు గురించి తెలుసుకుంటే ఆ భావన పోతుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే...చైనాలోని తైవానీస్‌ కు చెందిన ఒక ఫ్లవర్‌ షాప్‌లో ఒక మహిళ ఒక పువ్వును కొనుగోలు చేసింది. అయితే ఆ పువ్వు తాను ఊహించినంత అందంగా లేదని, ఆ పక్కనే ఉన్న మరో పువ్వు బాగుందని గుర్తించి, తాను కొనుగోలు చేసిన పవ్వును అక్కడే పెట్టేసి, ఆ పక్కనే ఉన్న ఐరీస్‌ జపొనికా (బటర్‌ ఫ్లై ఫ్లవర్‌) గా పిలిచే మరోక పుష్పాన్ని తీసుకొని వెళ్లిపోయింది.

ఆమె వెళ్లిన కాసేపటికి ఐరీస్‌ జపొనికా పుష్ఫం కనిపించలేదని గుర్తించిన ఆ ఫ్లవర్ షాపు సిబ్బందిలో కంగారు మొదలైంది. వెంటనే యజమానికి ఫిర్యాదు చేయడంతో ఆయన వెంటనే పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆ పువ్వు ప్రత్యేక తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు సీసీ పుటేజ్ పరిశీలించి, కారు నెంబర్ ఆధారంగా ఆమె ఇంటికెళ్లి, విషయం వివరిస్తూ పువ్వు ధర చెప్పారు. అంతే ఆమె మౌనంగా ఆ పువ్వును పోలీసులకు అప్పగించేసింది. దీంతో ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయకుండా ఆ పువ్వును షాపు యజమానికి పోలీసులు అందజేశారు.

ఇక ఆ పువ్వు వివరాల్లోకి వెళ్తే... ఐరిస్ జపొనికా పువ్వును ఎనిమిదేళ్లు కష్టపడి సేద్యం చేసి అభివృద్ధి చేశారు. అది చాలా అరుదైన పుష్పం. ఒకే ఒక్క పుష్పం వారి దగ్గర ఉంది. ఆ పువ్వు ధర సుమారు 20 కోట్ల రూపాయలు. ఈ పువ్వును కావాలంటూ చాలా మంది ఆ షాపు యజమానికి ఆర్డర్స్ కూడా ఇచ్చారు. దీంతో ఆ పువ్వుతో మరిన్ని పూలను సాగుచేసి, వ్యాపారం లాభాల బాటపట్టించాలని ఆ షాపు యజమాని భావిస్తే...అది తెలియని ఆమె ఉన్న ఒక్క పువ్వును ఎత్తుకెళ్లిపోయింది. అయితే పువ్వు మళ్లీ దొరకడంతో అంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. 

  • Loading...

More Telugu News