: బొడ్డుపై కొబ్బరికాయ గురించి స్పందించిన మరో హీరోయిన్!
'ఝుమ్మందినాదం' సినిమాలోని ఓ పాటలో తన బొడ్డుపై దర్శకుడు రాఘవేంద్రరావు పువ్వులు, పండ్లతో పాటు కొబ్బరికాయ కూడా వేయించారని... అందులో రొమాన్స్ ఏముందో తనకు అర్థం కాలేదని హీరోయిన్ తాప్సి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు కాస్తా వివాదాస్పదం కావడంతో, ఆ తర్వాత ఆమె క్షమాపణలు చెప్పింది.
తాజాగా ఇదే అంశంపై మరో హీరోయిన్ అమీ జాక్సన్ స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో 'మీ బొడ్డుపై కొబ్బరికాయ విసిరితే ఏం చేస్తారు' అనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనికి సమాధానంగా, తనకు ఇంత వరకు అలాంటి పరిస్థితి ఎదురు కాలేదని... ఇప్పటిదాకా తాను మంచి వ్యక్తిత్వం ఉన్న దర్శకులతోనే పని చేశానని చెప్పింది. బొడ్డుపై కొబ్బరికాయలు విసరడం చాలా భయంకరంగా ఉంటుందని... ఒకవేళ ఏ దర్శకుడైనా తన బొడ్డుపై కొబ్బరికాయ విసిరితే, దాన్ని తిరిగి వారి మొహం మీదకే విసురుతానని తెలిపింది.