: నితీశ్ కు జలకిచ్చిన సొంత ఎంపీ... ఇంత ఘోరం తాను చేయలేనని వ్యాఖ్య


ప్రజలు ఓటేసిన మహా కూటమిని బద్దలు కొడుతూ, గతంలో తాను స్వయంగా తిరస్కరించిన బీజేపీ వైపు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అడుగులు వేయడాన్ని ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుడు అలీ అన్వర్ తీవ్రంగా విమర్శించారు. ఆయన అంతరాత్మ ఈ పని చేయమని చెప్పిందేమో కానీ, తన అంతరాత్మ మాత్రం ఇటువంటి నీచపు కార్యాన్ని ప్రోత్సహించడం లేదని నిప్పులు చెరిగారు. నితీశ్ రాజకీయాలకు తాను మద్దతు ఇవ్వలేనని స్పష్టం చేశాడు. జనతాదళ్ (యు)కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు సైతం, ప్రజాభిప్రాయాన్ని కాదనడం తమకు ఇష్టం లేదని బహిరంగంగానే చెబుతుండటంతో, వారిని బుజ్జగించే యత్నాల్లో నితీశ్ ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ ఉదయం 10 గంటలకు నితీశ్ కుమార్ 6వ విడత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు బీజేపీ నేత సుశీల్ కుమార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

  • Loading...

More Telugu News