: కేటీఆర్ ఓ పనికిమాలిన వాడు: శ్రవణ్


తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ పనికిమాలిన వెధవ అని ... తన స్థాయిని మరిచి కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన మండిపడ్డారు. దేశభక్తుడైన ఉత్తమ్ కు గుంటనక్క లాంటి కేటీఆర్ కు పోలిక ఏమిటని ప్రశ్నించారు. అమెరికా నుంచి గుంటనక్కలా వచ్చి, ఇప్పుడు తోడేలులా మారాడని కేటీఆర్ పై ధ్వజమెత్తారు. ఉత్తమ్ పై చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇసుక మాఫియాలో టీఆర్ఎస్ నేతలకు వాటాలున్నాయని శ్రవణ్ ఆరోపించారు. ఇసుక రీచ్ కాంట్రాక్టర్లు కేటీఆర్ కుటుంబసభ్యులు, బంధువులే అని అన్నారు. పోలీసులకు కొన్న వాహనాలతో తనకు సంబంధం లేదని కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నారని... 2007లో హిమాన్షు మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కేటీఆర్ కంపెనీ పెట్టారని... ఈ విషయాన్ని 2014 ఎన్నికల అఫిడవిట్ లో కూడా పేర్కొన్నారని చెప్పారు. ఆ కంపెనీకి సంబంధించి 2015లో కూడా ఐటీ రిటర్నులు దాఖలు చేశారని తెలిపారు. కాంగ్రెస్ ను ముసలి నక్క అని సంభోదించిన కేటీఆర్... వారి పార్టీలో ఉన్న కేకే, డీఎస్ ల గురించి ఏమి చెబుతారని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News