: ముఖ్యమంత్రిగా నేడు నితీశ్ ప్రమాణ స్వీకారం.. డిప్యూటీ సీఎంగా సుశీల్ మోదీ!


బీహార్ ముఖ్యమంత్రి పదవికి నిన్న (బుధవారం) రాజీనామా చేసిన నితీశ్ కుమార్ నేడు (గురువారం) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజీనామా చేసిన 24 గంటలలోపే ఆయన తిరిగి సీఎం పీఠాన్ని అధిష్టించనున్నారు. బీజేపీ సహకారంతో ఆయన గద్దెనెక్కనున్నారు. సీఎం పదవికి రాజీనామా సమర్పించిన అనంతరం బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీతో కలిసి బుధవారం రాత్రి పొద్దుపోయాక గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠీని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు.

ఇక బీజేపీ సహకారంతో ఏర్పడనున్న నితీశ్ సర్కారులో సుశీల్ కుమార్ మోదీకి ఉప ముఖ్యమంత్రి పగ్గాలు లభించనున్నాయి. నేటి ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం జరగనున్నట్టు సమాచారం. దీంతో నితీశ్ ఏకంగా ఆరో సారి ముఖ్యమంత్రి కాబోతున్నారు.

  • Loading...

More Telugu News