: సిట్ అధికారులనే చార్మీ విచారణ చేసినట్టు కనిపిస్తోంది: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ


 సిట్ విచారణ తర్వాత చార్మిని చూస్తే వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయిని మించిన ధైర్యవంతురాలిలా కనిపించిందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా వర్మ స్పందిస్తూ, సిట్ విచారణకు వెళ్ళేటప్పుడు కంటే, విచారణ ముగిసిన అనంతరం బయటకు వస్తున్నప్పుడు చార్మి ఎప్పుడూ లేనంత అందంగా కనిపించిందని అన్నారు. చార్మి సంతోషాన్ని చూస్తుంటే సిట్ బృందాన్ని ఆమే ఇంటరాగేట్ చేసినట్టు కనిపిస్తోందని వర్మ తన దైన శైలిలో వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News