: ఆ పని చేయలేనప్పుడు సీఎం పదవి నాకు అనవసరం: నితీశ్ కుమార్
నీతి, నిజాయతీతో కూడిన రాజకీయాలను నమ్మినవాడినని, చివరి క్షణం వరకూ దానికే కట్టుబడి ఉంటానని బీహార్ సీఎం పదవికి కొంచెం సేపటి క్రితం రాజీనామా చేసిన నితీశ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని, తగిన ఏర్పాట్లు చేసే వరకు రాజ్యాంగబద్ధంగా ఈ పదవిలో కొనసాగుతానని అన్నారు. బీహార్ అభివృద్ధే తన జీవితాశయమని, ఆ పని చేయలేనప్పుడు ఆ పదవి తనకు అనవసరమని, ఇప్పటివరకు తనకు సహకరించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీహార్ గవర్నర్ ను రాష్ట్రపతిగా ఎంపిక చేసినందుకు గౌరవంతో సమర్థించామని, రాష్ట్రపతి ఎన్నిక విషయంలో తమకు ప్రత్యేకమైన అజెండా లేదని, ఆలోచన అంతకన్నా లేదని అన్నారు.