: జార్ఖండ్ వరదలు.. కొట్టుకుపోయిన అంబులెన్స్
జార్ఖండ్ రాష్ట్రంలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో పలమావు జిల్లా నుంచి రాంచీకి వస్తున్న అంబులెన్స్ ఒకటి కొట్టుకుపోయింది. కోయల్ నది సమీపంలోని సిథోయా వంతెన వద్దకు రాగానే అంబులెన్స్ ఆగిపోయింది. వెంటనే, డ్రైవర్ సహా మరో వ్యక్తి కిందకు దిగారు. ఆ తర్వాత అంబులెన్స్ ను నెట్టేందుకు యత్నిస్తున్న సమయంలో, వరద ప్రవాహం ఉద్ధృతం కావడంతో అది కొట్టుకుపోయింది. అయితే, ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు డ్రైవర్ చెప్పకపోగా పారిపోయాడు. అంబులెన్స్ లో ఓ పేషెంట్ సహా ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.