: తూర్పుగోదావరి జిల్లాలో గిరిజనుల మృతి అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన విజయసాయిరెడ్డి


తూర్పుగోదావరి జిల్లా చాపరాయిలో జరిగిన గిరిజనుల మృతి ఘటనను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో లేవనెత్తారు. గిరిజనుల మృతికి కేవలం ఫుడ్ పాయిజనే కారణం కాదని.... ఇతర కారణాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. ఏజెన్సీ ఏరియాలో రక్షిత మంచి నీరు, రోడ్డు సౌకర్యం కూడా లేవని అన్నారు. చాపరాయిలో జరిగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ఏపీలో గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఈ నేపథ్యంలో విజయసాయి ప్రశ్నకు గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరం సమాధానమిస్తూ, గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం ప్రాంతంలో ఉన్న చాపరాయి గ్రామంలో 16 మంది గిరిజనులు ఆకస్మికంగా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News