: చెలరేగుతున్న ధావన్.. ఆకట్టుకుంటున్న స్టయిల్!


టీమిండియా ఓపెనర్ ఆటతోనే కాకుండా ఆహార్యంతో కూడా ఆకట్టుకుంటున్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు దిశగా సాగిపోతోంది. ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా స్కోరు బోర్డును ధావన్ దూకుడుగా ముందుకు తీసుకెళ్తున్నాడు. రెండు చెవులకు పోగులతో బరిలో దిగిన ధావన్ అభిమానులను అలరించాడు. కెరీర్ ఆరంభంలో ఒక చెవిపోగుతో అభిమానులను అలరించిన ధావన్ తరువాత వివిధ రకాల తలకట్టు స్టైల్స్ తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత అమ్మాయి తరహాలో రెండు చెవులకు పోగులు ధరించి వినూత్నమైన లుక్ తో ధావన్ అలరిస్తున్నాడు. 151 బంతుల్లో 160 పరుగులు చేసిన ధావన్, పుజారా (64)తో కలిసి స్కోరు బోర్డును ఉరకలెత్తిస్తున్నాడు. 

  • Loading...

More Telugu News