: `మణికర్ణిక`లో తాంత్యా తోపేగా అతుల్ కులకర్ణి!
`గౌతమీ పుత్ర శాతకర్ణి` తర్వాత ఝాన్సీ రాణి కథతో దర్శకుడు క్రిష్ మరో చారిత్రాత్మక కథకు దర్శకత్వం వహిస్తున్నారు. `మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ` పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కంగనా రనౌత్ టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. ఈ కథలో కీలక పాత్ర పోషించే తాంత్యా తోపేగా అతుల్ కులకర్ణి నటించనున్నారు. ఈ విషయాన్ని అతుల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తెలుగులో ఈయన `జయం మనదేరా!`, `తుఫాన్` వంటి సినిమాల్లో కనిపించారు. రెండు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న అతుల్, కంగనా రనౌత్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని ట్వీట్‌లో చెప్పారు. ఈ సినిమాలో అతుల్‌కు ప్రత్యేకంగా యుద్ధ సన్నివేశాలు ఉన్నట్లు, వాటి కోసం శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.