: చంద్రబాబూ గారు! ముద్రగడ విషయంలో తప్పు చేస్తున్నారు!: ట్విట్టర్ లో వైఎస్ జగన్
ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రను ఏపీ పోలీసులు అడ్డుకోవడంపై వైకాపా అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
ముఖ్యమంత్రి గారూ...
ఒక్క విషయం చెప్పండి!
ముద్రగడ గారిని హౌస్ అరెస్టు ఎందుకు చేశారు?
కాపులకు మీరు ఇచ్చిన హామీని, మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి అనే కదా వారు మిమ్మల్ని నిలదీస్తున్నది. ఇలా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నందుకు అరెస్టులు, హౌస్ అరెస్టులు, బైండోవర్లు చేయటం ఏమిటి? వేలమంది పోలీసుల్ని మోహరించటం ఏమిటి?
తప్పు చేస్తున్నారు చంద్రబాబు గారూ!
అని ఓ పోస్టును ఈ మధ్యాహ్నం 1:05 గంటల సమయంలో పెట్టడంతో అదిప్పుడు వైరల్ అవుతోంది.