: కానిస్టేబుల్ శ్రీనివాస్ నాపై చెయ్యి వేశాడు...చర్యలు తీసుకోండి: అధికారులకు ఛార్మీ ఫిర్యాదు


ఎక్సైజ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ పై సినీ నటి ఛార్మీ ఫిర్యాదు చేసింది. విచారణకు హాజరయ్యేందుకు ఛార్మీ సిట్ కార్యాలయానికి వచ్చిన సమయంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తనను అభ్యంతరకరంగా తాకాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఎక్సైజ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తాను కార్యాలయానికి వచ్చిన సమయంలో కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద ఎక్సైజ్ పోలీసులు పెద్ద సంఖ్యలో ప్రధాన ద్వారానికి అడ్డుగా నిల్చున్నారని, వారిని ఛేదించుకుంటూ రావడం కష్టమైందని ఆమె చెప్పింది. మహిళా పోలీసులు ఉన్నప్పటికీ మగ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో తన చేతులు పట్టుకుని లాగేందుకు కొందరు ప్రయత్నించారని, శ్రీనివాస్ తనను అభ్యంతరకరంగా తాకాడని ఆమె తెలిపింది. దీనిపై ఎక్సైజ్ అధికారులు స్పందించాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News