: పనిలో పడిపోయిన పూరీ, ఛార్మీ.. కొండాపూర్ లో షూటింగ్


టాలీవుడ్ లో డ్రగ్స్ దందా పెను కలకలం రేపిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ దందాలో తమ పేర్లు వెలుగు చూడడంతో, తమ కుటుంబాలు తీవ్ర క్షోభకు గురయ్యాయని పూరీ జగన్నాథ్ తో పాటు సిట్ విచారణకు హాజరైన ప్రతి ఒక్కరూ వాపోయిన సంగతి తెలిసిందే. దీనిపై పూరీ ఇప్పటికే రెండు సార్లు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించిన సంగతి కూడా విదితమే. బహిరంగ లేఖలో తనపై విమర్శలు చేసే వారిపై పూరీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన తీరుపై కాకుండా ఇతర సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించాడు.

మరోవైపు, వీటన్నింటినీ మర్చిపోయి పూరీ, ఛార్మీ షెడ్యూల్ ప్రకారం షూటింగ్ లో పడిపోవడం వారి అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. ఇలాంటి ఆరోపణలు, వివాదాలు తమను ఏమీ చేయలేవని వారు నిరూపించినట్టైందని పేర్కొంటున్నారు. షెడ్యూల్ ప్రకారం నేటి ఉదయం కొండాపూర్ లో 'పైసా వసూల్' షూటింగ్ లో ఛార్మీ పాల్గొంది (ప్రొడక్షన్ పనులను ఛార్మీ పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే). ఆసుపత్రిలో చిత్రీకరించిన సన్నివేశాల్లో ఛార్మీ పాల్గొన్నట్టు సమాచారం. 

  • Loading...

More Telugu News