: నేడు అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్న టీమిండియా యువ ఆల్ రౌండర్!
అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో టీమిండియా యువ ఆల్ రౌండర్ నేడు అరంగేట్రం చేయనున్నాడు. శ్రీలంకతో టీమిండియా టెస్టు సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో టీమిండియా యువ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్ కోహ్లీ అవకాశం ఇచ్చాడు. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా లాంటి ఆల్ రౌండర్ ఉండడం ఏ జట్టుకైనా వరం లాంటిదని కోహ్లి పేర్కొన్నాడు. అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేయడం ఆనందంగా ఉందని హార్దిక్ పాండ్యా తెలిపాడు. కాగా, ఐపీఎల్ లో మంచి ప్రదర్శనతో జట్టులో స్థానం సంపాదించుకున్న హార్దిక్ పాండ్యా, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ టీ20, వన్డే జట్టులో స్ధానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. మంచి ఆటతీరుతో జట్టులోని మిడిల్ ఆర్డర్ లో ప్రభావం చూపుతున్నాడు. ఈ క్రమంలో టెస్టు జట్టులో చోటు సంపాదించుకోవడం పాండ్యాలోని ప్రతిభకు నిదర్శనం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.