: ముద్రగడ పాదయాత్రలో ఎవ్వరూ పాల్గొనవద్దంటూ పోలీస్ శాఖ ప్రచారం


కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రేపటి నుంచి నిరవధిక పాదయాత్రను చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ స్పందిస్తూ, ఆయన పాదయాత్రకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని ఏపీ డీజీపీ సాంబశివరావు ఇప్పటికే పలు ప్రకటనలు చేశారు. తాజాగా, ఈ రోజు కూడా ఓ ప్రకటన చేశారు. రాజమండ్రి అర్బన్ ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ, ముద్రగడ పాదయాత్రలో ప్రజలెవ్వరూ పాల్గొన వద్దంటూ మైకుల ద్వారా పోలీస్ శాఖ ప్రచారం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కిర్లంపూడి, రాజమహేంద్రవరం, అమలాపురం తదితర ప్రాంతాల్లో పోలీసులు మోహరించినట్టు చెప్పారు. కిర్లంపూడిలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు రాజకుమారి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News