: టాప్ గేర్ లో వైసీపీ.. ఆనందీబెన్ తో విజయసాయి భేటీ!


వైసీపీ దూకుడు పెంచుతోంది. రకరకాల వ్యూహాలతో జాతీయ స్థాయిలో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. కేంద్రం, రాష్ట్ర స్థాయిలో అత్యున్నత పదవులు దక్కే అవకాశం ఉన్న ప్రముఖులను ముందస్తుగానే వైసీపీ నేతలు కలుస్తుండటం పరిపాటిగా మారింది. నేడు రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన రామ్ నాథ్ కోవింద్ ను కూడా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ముందుగానే కలిశారు. మర్యాదపూర్వకంగానే ఆయనను కలిశానని అప్పట్లో ఆయన చెప్పారు.

తాజాగా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ ను అహ్మదాబాద్ లో ఇటీవల విజయసాయి కలిశారు. వీరిద్దరి మధ్య భేటీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయింది. అయితే మర్యాదపూర్వకంగానే ఆమెను కలిశానని విజయసాయి ఎప్పట్లాగానే సమాధానం చెప్పారు. మరోవైపు, తెలుగు రాష్ట్రాలకు ఆనందిబెన్ పటేల్ గవర్నర్ గా వస్తున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, ముందుగానే ఆమెను విజయసాయి కలిశారని విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News