: గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సహాయక చర్యలకు దిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్


భారీ వర్షాల కారణంగా గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో భారత వాయుసేనకు చెందిన ఐదు హెలికాప్టర్లు సహాయక చర్యల కోసం ఈ రోజు రంగంలోకి దిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. గుజరాత్ లోని బనస్కాంత, పటాన్ జిల్లాలకు రెండు హెలికాప్టర్లు వెళ్లగా, రాజస్థాన్ లోని జోధ్ పూర్ వాయుసేన స్థావరం నుంచి రెండు హెలికాప్టర్లు ముంపు ప్రాంతాలైన జలోర్, పాలి జిల్లాలకు మందులను తీసుకెళ్లాయి. బాధితులకు సాయమందించేందుకు జాతీయ విపత్తుల నిర్వహణ దళంతో కలసి వాయుసేన చర్యలు చేపట్టింది.

  • Loading...

More Telugu News