: లాలూకు మరో షాక్...మీసా భారతి ఫాంహౌస్ స్వాధీనానికి ఈడీ నిర్ణయం
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు గడ్డుకాలం నడుస్తోంది. కుమారులపై అవినీతి ఆరోపణలు, సందిగ్థంలో పడిన పొత్తు వ్యవహారం, మరోపక్క ఈడీ దాడులతో లాలూ ప్రసాద్ యాదవ్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని బిజ్ వాసన్ ప్రాంతంలో గల లాలూ కుమార్తె మీసా భారతి ఫాం హౌస్ పై దాడులు నిర్వహించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దానిపై మీసా, శైలేష్ లు ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందలేదని, దీంతో ఫాం హౌస్ ను స్వాధీనం చేసుకునేందుకు నిర్ణయించినట్టు తెలిపింది. దీంతో లాలూకు షాక్ తగిలినట్టైంది.