: పార్లమెంటుకు చేరుకున్న ప్రణబ్, కోవింద్.. ఘన స్వాగతం!
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కొత్త రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనున్న రామ్ నాథ్ కోవింద్ లు పార్లమెంటుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వీరికి పార్లమెంటు వద్ద ఘన స్వాగతం పలికారు. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్ లు వారికి స్వాగతం పలికారు. వారిని పార్లమెంటు సెంట్రల్ హాల్లోకి తోడ్కొని వెళ్లారు. ప్రధాని మోదీ, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, ఎంపీలు వీరిద్దరూ సభలోకి ప్రవేశించిన సమయంలో గౌరవపూర్వకంగా లేచి నిలబడ్డారు. అనంతరం జాతీయగీతాలాపన జరిగింది.