: మరోసారి విమర్శలు చేసిన రాంగోపాల్ వర్మ... ఈ సారి టార్గెట్ తెలంగాణ బ్రాండ్!
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ డ్రగ్స్ వ్యవహారంలో జరుగుతున్న దర్యాప్తుపై మరోసారి విమర్శలు గుప్పించారు. నిన్నటి వరకు సిట్ లక్ష్యంగా విమర్శలు చేసిన రాంగోపాల్ వర్మ తాజాగా తెలంగాణ పరువు పోయిందని వాపోయాడు. ఇంతవరకు కేసీఆర్ సమర్థుడైన రాజకీయనాయకుడని ముంబై వాసులు పేర్కొనే వారని, సిట్ విచారణ కారణంగా హైదరాబాదుతో పాటు తెలంగాణ బ్రాండ్ విలువను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశాడు.
తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులను విచారిస్తున్న తీరుతో తెలంగాణా ప్రతిష్టకే భంగం కలిగిందని పేర్కొన్నాడు. సిట్ విచారణతో పంజాబ్ కంటే తెలంగాణ అధ్వానమైన స్థితిలో ఉందని ముంబై వాసులంటున్నారని వర్మ పేర్కొన్నాడు. బాహుబలి సినిమాతో తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని రాజమౌళి అమాంతం పెంచితే... ఆ స్థాయిని అకున్ సబర్వాల్ దేశంలో దిగజార్చారని వర్మ తెలిపాడు.