: నవదీప్ కు అంతర్జాతీయ డ్రగ్ ముఠాలతో సంబంధాలు?.. రక్త నమూనా ఇవ్వడానికి నిరాకరణ!
టాలీవుడ్ యువనటుడు నవదీప్ విచారణలో పలు సరికొత్త విషయాలు వెలుగుచూసినట్టు తెలుస్తోంది. నవదీప్ కు అంతర్జాతీయ డ్రగ్ ముఠాలతో సంబంధాలు ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. నవదీప్ కు నేరుగా ఇతర దేశాల నుంచి పెద్దమొత్తంలో డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు సమాచారం. పలు దేశాల డ్రగ్ మాఫియా నుంచి నేరుగా డ్రగ్స్ ను తన వద్దకు నవదీప్ తెప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది. నవదీప్ డ్రగ్స్ ను పబ్బుల్లో విచ్చల విడిగా వినియోగించినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే రక్తనమూనాను ఇచ్చేందుకు నవదీప్ ససేమిరా అన్నాడు. దీంతో నవదీప్ రక్తనమూనాలు సేకరించేందుకు వచ్చిన ఉస్మానియా వైద్యులను సిట్ అధికారులు వెనక్కి పంపారు.