: మంత్రి నాయినికి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన రఘునందన్!


టీడీపీ నేత రేవంత్ రెడ్డి, బీజేపీ నేత రఘునందన్ లకు పబ్ లకు వెళ్లే అలవాటు ఉందంటూ తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై రఘునందన్ స్పందిస్తూ.. పబ్ లను పెంచిపోషిస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఇందుకు నిదర్శనం ప్లేబాయ్ పబ్ ను ఇటీవల ప్రారంభించిన మంత్రి కేటీఆరేనని అన్నారు. తన జీవితంలో కనీసం ఆల్కహాల్ ఎన్నడూ ముట్టలేదని, దిగజారుడు వ్యాఖ్యలకు నాయిని స్వస్తి చెప్పాలని రఘునందన్ ఈ సందర్భంగా హితవు పలికారు.

పబ్ లు, క్లబ్ లకు తాను వెళ్లనని, ఈ విషయం అందరికీ తెలుసని అన్నారు. తన రక్తనమూనాలు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, మరి, సీఎం కేసీఆర్, మంత్రులు ఇందుకు సిద్ధమేనా? అని నాయిని నర్సింహారెడ్డిని సూటిగా ప్రశ్నించడమే కాదు, సవాల్ విసురుతున్నానని అన్నారు.

  • Loading...

More Telugu News