: ఈ రోజు రాత్రికి ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్


కొత్త రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు రాత్రికి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. కోవింద్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ నెల 27 వరకు కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటారని సమాచారం. ప్రధాని నరేంద్రమోదీని ఆయన కలవనున్నారని, ఈ మేరకు ఆయన అపాయింట్ మెంట్ కోరినట్టు సమాచారం. కాగా, కోవింద్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News