: జైరాం రమేశ్ ఆరోపణలను తోసి పుచ్చిన వెంకయ్యనాయుడు!
తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి టెండర్లు పిలవకుండానే హైదరాబాద్ పోలీసుల కోసం వెంకయ్యనాయుడు కుమారుడికి చెందిన హర్ష టొయోటా నుంచి ఇన్నోవాలను కొనుగోలు చేసిందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై వెంకయ్యనాయుడు స్పందిస్తూ, ఆ ఆరోపణలు అర్థరహితమని కొట్టిపారేశారు. ఇలాంటి అసంబద్ధ ఆరోపణలు గతంలోనే వచ్చాయని, వాటిపై ఎప్పుడో తాను సమాధానం చెప్పానని అన్నారు. ఈ విషయమై కొంతమంది న్యాయస్థానాలకు కూడా వెళ్లారని, కోర్టులు వారి వ్యాజ్యాలను పరిగణనలోకి తీసుకోలేదన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ అంశంలో తాను చాలా విచారం వ్యక్తం చేస్తున్నానని, ఈ ఆరోపణలు చేసిన వారు ఈ స్థాయికి దిగజారుతారని తాను ఊహించలేదని వెంకయ్య విమర్శించారు.