: వైసీపీ ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో అర్థమౌతోంది: మంత్రి దేవినేని


తనపై ఉన్న అక్రమాస్తుల కేసులన్నింటినీ ఒకేసారి విచారణ జరపాలని కోరుతూ హైకోర్టులో వేసిన పిటిషన్ ను వైసీీపీ అధినేత జగన్ ఉపసంహరించుకున్న అనంతరం, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను ఆయన ఇటీవల కలిసిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఆయన ఇంతవరకూ వివరణ ఇవ్వకపోవడంపై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా విమర్శలు గుప్పించారు. గవర్నర్ ను ఎందుకు కలిశాను, ఎందుకు కలవాల్సి వచ్చింది.. ఏ విషయమై విన్నవించుకున్నాననే దానిపై జగన్ ఇంతవరకూ నోరుతెరవలేదంటే, ఆ పార్టీ ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో అర్థమౌతోందని విమర్శించారు.

‘కేవీపీ రామచంద్రరావును, జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతున్నాను. 2009, 2013లో పోలవరం ప్రాజెక్టు పనులు ఎందుకు ఆగిపోయాయో చెప్పాలి. సుమారు 13 సీబీఐ ఎన్ ఫోర్స్ మెంట్ కేసుల్లో జగన్ మోహన్ రెడ్డి గారు ఎ1 ముద్దాయి. పోలవరం ప్రాజెక్ట్ కు అడ్డం పడుతున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎ2 ముద్దాయి. వీళ్లందరి లక్ష్యం కూడా పోలవరం ప్రాజెక్టు పనులకు అడ్డం పడాలి, ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా చూడాలనేదే వారి ఉద్దేశ్యం’ అంటూ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News