: ఎల‌క్ట్రానిక్స్‌పై భారీ త‌గ్గింపు... ఫ్లిప్‌కార్ట్ `గ్రాండ్ గ్యాడ్జెట్ డేస్‌`


`అమెజాన్ ప్రైమ్ సేల్‌` ద్వారా అమెజాన్ కంపెనీ భారీగా లాభాలు పొంద‌డంతో ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్ల‌న్నీ అదే బాట ప‌ట్టాయి. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ ఒక సేల్ త‌ర్వాత మ‌రో సేల్ ప్ర‌క‌టిస్తూ వినియోగ‌దారుల‌కు ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌డం లేదు. తాజాగా `గ్రాండ్ గ్యాడ్జెట్ డేస్‌` పేరుతో ఫ్లిప్‌కార్ట్ మ‌రో సేల్‌ను ప్రారంభించింది. దీని ద్వారా అన్నిరకాల ఎల‌క్ట్రానిక్ గ్యాడ్జెట్ల‌పై భారీ త‌గ్గింపును ఆఫ‌ర్ చేస్తోంది.

జూలై 26 వ‌రకు కొన‌సాగే ఈ సేల్‌లో రూ. 999 నుంచే ఎలక్ట్రానిక్ వ‌స్తువులు అందుబాటులో ఉన్నాయి. ఇంటెల్ కోర్ ఐ3, ఐ5 ల్యాప్‌టాప్‌ల‌ను రూ. 26,990, రూ. 41,990కి అంద‌జేస్తుండ‌గా, ఏస‌ర్‌, ఐబాల్‌, లావా, మైక్రోమ్యాక్స్ ల్యాప్‌టాప్‌ల‌పై భారీ త‌గ్గింపు ప్ర‌క‌టించింది. అంతేకాకుండా ల్యాప్‌టాప్‌ల‌పై ఎక్స్చేంజ్ ఆఫ‌ర్ కూడా క‌ల్పించింది.

అలాగే రూ. 39,499తో కెనాన్ ఈఓఎస్ 700డీ డీఎల్ఎస్ఆర్ కెమెరా కొంటే రూ. 6,999 విలువ గ‌ల మోటో హెడ్‌ఫోన్స్‌ను ఉచితంగా ఇస్తున్నారు. ఇంకా ఇత‌ర కెమెరాల‌పై కూడా భారీ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫ‌ర్ చేస్తోంది. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించిన వారికి 5 శాతం త‌గ్గింపు స‌దుపాయం కూడా ఫ్లిప్‌కార్ట్ క‌ల్పించింది.

  • Loading...

More Telugu News