: కాజల్ డిమాండ్ తో సందిగ్ధంలో పడ్డ ధనుష్!


టాలీవుడ్ లో కొంచెం స్లో అయినప్పటికీ... కోలీవుడ్ లో మాత్రం హీరోయిన్ కాజల్ చాలా బిజీగా ఉంది. తమిళ సూపర్ స్టార్లు విజయ్, అజిత్ చిత్రాల్లో ఆమె నటిస్తోంది. ఆగస్ట్ 10న అజిత్ సినిమా 'వివేగం' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విజయ్ సరసన 'మెర్సల్' సినిమాలో నటిస్తోంది. ఈ క్రమంలో కాజల్ ను మరో అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. హీరో ధనుష్ తో కలసి నటించే ఛాన్స్ కాజల్ కు వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'మారి' సినిమా కమర్షియల్ హిట్ కావడంతో... ఇప్పుడు 'మారి-2' చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాను ధనుష్ తన సొంత బ్యానర్ లో నిర్మించబోతున్నాడు.

ఈ సినిమాలో 'మారి'లో నటించిన నటీనటులనే తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో, కాజల్ ను సంప్రదించగా ఆమె 'ఓకే' చెప్పింది. అయితే, రూ. 2 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేసిందట. దీంతో, ఆమె అడిగినంత ఇచ్చేద్దామా? లేక వేరే హీరోయిన్ ను తీసుకుందామా? అనే ఆలోచనలో ధనుష్ పడ్డాడట.

  • Loading...

More Telugu News