: 'సాహో'లో రెండో విలన్ గా బాలీవుడ్ సీనియర్ స్టార్?
'బాహుబలి' సినిమా ఘన విజయం సాధించిన తర్వాత ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'సాహో'. ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో సమాచారం అందుతోంది. మరో విలన్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే నటించబోతున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్ కు జోడీగా అనుష్క నటిస్తున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాను రూ. 150 కోట్లతో తెరకెక్కిస్తున్నారు.