: సినిమా వాళ్లు మాత్రమేనా? మిగతావారి సంగతేంటి?: ఆర్. నారాయణమూర్తి
హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో కేవలం సినిమా రంగాన్ని మాత్రమే లక్ష్యం చేసుకున్నట్టు తెలుస్తోందని, ఈ విధానం సరికాదని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, సినిమా వాళ్లతో పాటు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలకు చెందిన ఉద్యోగుల నుంచి రాజకీయ నాయకులు, వ్యాపారులు సైతం డ్రగ్స్ వాడుతున్నారని అభిప్రాయపడ్డ ఆయన, సినిమా వాళ్లు మాత్రమే వీటిని వాడుతున్నట్టు ప్రచారం కలిగిస్తుండటం సరికాదని చెప్పారు. పాఠశాల చిన్నారులు సైతం డ్రగ్స్ కేసుల్లో బానిసలుగా మారుతున్నారన్న వార్తలు బాధను కలిగించాయని, ఈ మాఫియాను సమూలంగా అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని నారాయణమూర్తి వెల్లడించాడు.