: అన్నింటికీ 'నో' చెబుతున్న నవదీప్... డైరెక్టుగా సబర్వాల్ రంగంలోకి దిగే అవకాశం!
ఈ ఉదయం నుంచి సిట్ అధికారులు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు తెలియదని, నో అని మాత్రమే నవదీప్ సమాధానాలు చెబుతుండటంతో, మధ్యాహ్న భోజన విరామం తరువాత ఎక్సైజ్ ఈడీ అకున్ సబర్వాల్ స్వయంగా రంగంలోకి దిగనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటివరకూ నవదీప్ కు వ్యతిరేకంగా తమ వద్ద ఉన్న సాక్ష్యాలను సైతం అధికారులు ఇంకా నవదీప్ ముందు పెట్టలేదని తెలుస్తోంది.
సబర్వాల్ వచ్చి కూర్చున్న తరువాత, వాటిని ఒక్కొక్కటిగా ముందుంచి నవదీప్ ను మరింత లోతుగా విచారించాలని అధికారులు భావిస్తున్నారు. ఈలోగా, విచారణకు సహకరించి తెలిసిన పూర్తి వివరాలు వెల్లడించకుంటే జరిగే పరిణామాలను నవదీప్ కు ఓసారి తెలియజేస్తామని అధికారులు వెల్లడించారు. ఇక నవదీప్ పబ్ లో అత్యంత ముఖ్యులకు మాత్రమే ఇచ్చే ప్రత్యేక కాక్ టైల్ డ్రింక్ తయారీ, దానిలో కలిపే పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయన్న విషయంపై దాదాపు రెండు గంటల పాటు నవదీప్ ప్రశ్నలను ఎదుర్కోవచ్చని తెలుస్తోంది.