: ఎవరికీ శిక్షలు పడవు... సినీ ప్రముఖులకు అభయమిస్తున్న న్యాయవాదులు


డ్రగ్స్ దందాలో ఇంతవరకూ సిట్ విచారించిన వారిలో ఎవరికీ శిక్షలు పడే అవకాశాలు లేవని, ఈ కేసులో నిరూపించదగ్గ సాక్ష్యాలను సిట్ ఇంతవరకూ సేకరించలేదని పేరొందిన న్యాయవాదులు అభయమిస్తున్నారు. సిట్ నోటీసులు అందుకున్న వారు న్యాయవాదుల వద్దకు పరుగులు పెట్టగా, నార్కోటిక్స్ చట్టంలోని లొసుగులను వెతికిన న్యాయవాదులు, వాటి గురించి చెబుతూ, భరోసా ఇస్తున్నారు. ధైర్యంగా విచారణకు వెళ్లాలని ధైర్యం చెబుతున్నారు.

ఇక ఇంతవరకూ నోటీసులు అందుకున్న ఏ సినీ ప్రముఖుడి వద్దా ప్రత్యక్షంగా డ్రగ్స్ పట్టుబడలేదన్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ దొరక్కుండా, కేవలం వాడారని నిరూపించినంత మాత్రాన వారిని జైలుకు పంపే అవకాశాలు లేవన్నది న్యాయవాదుల వాదన. జుట్టు వెంట్రుకలు లేదా గోళ్లలో డ్రగ్స్ ఆనవాళ్లను నిరూపించినా, అది జైలు శిక్షల వరకూ వెళ్లదని, ఇక గత మూడు నెలల కాలంలో డ్రగ్స్ తీసుకోని వాళ్ల నుంచి డ్రగ్స్ ఆనవాళ్లు నిరూపించడం అసాధ్యమని చెబుతున్నారు. డ్రగ్స్ వాడిన వాళ్లను కేవలం బాధితులుగా మాత్రమే పరిగణించాలని మన చట్టాలు చెబుతుండటంతో, వారిని డీటాక్సిఫికేషన్‌ సెంటర్లకు పంపించాలన్న సలహా మాత్రమే కోర్టు నుంచి వస్తుందని, అంతకుమించి మరేమీ జరగదని అంటున్నారు.

  • Loading...

More Telugu News