: సంపూ, ఆ 'సన్న పిన్ను ఛార్జర్' సంగతి ఏమిటి?: నవ్వులు పూయించిన తారక్


బిగ్ బాస్ షోకు వ్యాఖ్యాతగా ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి శని, ఆదివారాలు ఆ షోలో జరిగే సంఘటనలపై ఎన్టీఆర్ వారితో ముచ్చటిస్తూ, విశ్లేషిస్తుంటాడు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుతో కలిసి నవ్వులు పూయిస్తూ, అతనిలో ఆత్మవిశ్వాసం నింపాడు. ఈ సందర్భంగా తారక్, బర్నింగ్ స్టార్ సంపూని ఉద్దేశించి, 'అసలు సన్న పిన్ను ఛార్జర్ ఎందుకడిగారు?' అని ప్రశ్నించాడు.

దీనికి సంపూ స్పందిస్తూ, 'అన్నా! హరితేజ, ఆదర్శ్ మధ్య సరదాగా మొదలైన పోట్లాట సీరియస్ గా మారిపోయింది. దీంతో ఇద్దరూ సీరియస్ అయిపోతున్నారని భావించి, దానిని ఎలా తగ్గించాలో అర్థం కాక, 'భయ్యా సన్న పిన్ను ఛార్జర్ ఉందా?' అని అడిగాను. దీంతో అంతా నవ్వేశారు' అని చెప్పాడు. దీంతో జూనియర్ మళ్లీ... "అది కాదు సంపూ నీ పిల్లలు తగువులాడుకుంటే కూడా ఇలాగే సన్నపిన్ను ఛార్జర్ అడుగుతావా?" అని అడిగాడు. దీంతో "వారినైతే భయపెడతా"నని సంపూర్ణేష్ చెప్పాడు.

 

  • Loading...

More Telugu News