: మాదక ద్రవ్యాలకు సంజయ్ దత్ ఎలా బానిసయ్యాడో ఈ సినిమాలో చూపిస్తాం: రణ్ బీర్ కపూర్
బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా దర్శకుడు రాజకుమార్ హీరాణీ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సంజయ్ దత్ పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంజయ్ దత్ ను దేవుడిలా చూపించేందుకు ఈ చిత్రాన్ని తీయడం లేదని, ఆయనలోని మానవత్వ కోణాన్ని చూపించబోతున్నామని చెప్పాడు.
సంజయ్ దత్ మాదక ద్రవ్యాలకు ఎలా బానిసయ్యాడు, జైలు కెళ్లిన రోజులు, తల్లి నర్గీస్ దత్ చనిపోయినపుడు ఎలా కుమిలిపోయాడు? అనే విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నామని చెప్పాడు. సంజయ్ దత్ జీవితంలో ఎన్నో వివాదాస్పద సంఘటనలు చోటుచేసుకున్నప్పటికీ, ఆయనను అభిమానులు ఇప్పటికీ ఇష్టపడుతున్నారని రణ్ బీర్ చెప్పాడు.